
సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ..:మేము ఊహించిన దానికంటే సినిమాని ఎక్కువ స్థాయికి తీసుకెళ్ళిన ఆడియన్స్ కి నా పాదాభివందనాలు. ఈ రోజు నాకు ఎనిమిది సక్సెస్ లు అంటున్నారు. ఆడియన్స్ సపోర్ట్ లేకపొతే నాకు ఏ విజయం వచ్చేది కాదు. బాహుబలిని శివగామి ఎత్తుకొని చూపించినట్లు ఆడియన్స్ ఈ సినిమా పైకెత్తుకుని చూపించడం గూస్ బంప్స్ లా వుంది. ఆడియన్స్ అందరికీ థాంక్ యూ. రాజు గారు, శిరీష్ గారు నన్ను దర్శకుడిగా నిలబెట్టిన నిర్మాతలు. పటాస్ సినిమాతో మా ప్రయాణం మొదలైయింది. ఎఎస్విసి నా హోం బ్యానర్. వారితో సినిమాలు చేస్తూనే వుంటాను. మా రైటింగ్ టీంకి థాంక్ యూ. ఐశ్వర్య భాగ్యం పాత్రతో అందరూ కనెక్ట్ అవుతున్నారు. క్యారెక్టర్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది. మీనాక్షి కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. బుల్లిరాజుకి చిన్న వయసులో పెద్ద పేరు వచ్చింది. తన పాత్రని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. భీమ్స్ క్రియేట్ చేసి సాంగ్స్ ఈ సక్సెస్ లో పెద్ద ఎసెట్.
వెంకటేష్ గారితో ఒక అభిమానిలా పని చేశాను. ఈ సినిమాతో మా మధ్య ఒక బాండింగ్ ఏర్పడింది. ఆయనతో జర్నీ కంటిన్యూ అవుతుంది. వెంకటేష్ నాకు ఫ్రెండ్, గురు, ఫ్యామిలీ మెంబర్. ఈ సినిమాకి నా కంటే ఎక్కువ ఎనర్జీతో పని చేశారు. ఆయన ఎనర్జీ సపోర్ట్ లేకపోతే మేము అంతా బాగా చేసివుండేవాళ్ళం కాదు. నన్ను ఇంత బలంగా నమ్మిన వెంకటేష్ గారికి థాంక్ యూ. ఇది మా హ్యాట్రిక్ మూవీ. ఆయన సపోర్ట్ మర్చిపోలేను. ఇప్పటి వరకూ నేను తీసిన ఎనిమిది సినిమాలు.. ఒకొక్క సినిమా ఒక్కో జర్నీ. ఇందులో లాస్ట్ ఐదు సినిమాలు కంటిన్యూగా వందకోట్ల గ్రాసర్స్. లాస్ట్ ఐదు సినిమాలు యూఎస్ లో వన్ మిలియన్ గ్రాసర్స్. ఒక దర్శకుడిగా ఆడియన్స్ కి ఎంత థాంక్ ఫుల్ గా ఉండాలో అర్ధం కావడం లేదు. తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనం. నాకు తెలిసింది సినిమా ఒక్కటే. థియేటర్స్ లో ఆడియన్స్ విజల్స్ కొట్టే సినిమా చేయడం నాకు ఇష్టం. నాకు తెలిసిన సినిమా ఇదే. అలాంటి సినిమానే చేస్తాను. ఆడియన్స్ విజల్ కొడితే విజల్ కొడతాను. ఎమోషన్ అయితే నేనూ ఎమోషన్ అవుతాను. ప్రతి ఫ్రైడే థియేటర్ లో వుంటాను. నా కంటే బాగా తీస్తే నేర్చుకుంటా. నేను తప్పులు తీస్తే సరిదిద్దుకుంటా. ఎనిమిది సినిమాల జర్నీ ఇది. ఇక మీద ఇలానే జర్నీ వుంటుంది. మీ అందరి సపోర్ట్ బ్లెసింగ్స్ కావాలి. అందరికీ థాంక్ యూ”అన్నారు.