హాస్య బ్రహ్మ అని ప్రేమగా పిలుచుకునే మన బ్రహ్మానందం తనయుడితో కలిసి “బ్రహ్మానందం” సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయిపోయారు. బ్రహ్మానందం కేవలం నవ్వించడమే కాక ఎమోషనల్ సీన్లు కూడా అద్భుతంగా పండించగలరు.సోగ్గాడి పెళ్ళాం, రంగ రంగమార్తాండ, వీరాంజనేయలు విహార యాత్ర ఇలా కొన్ని సినిమాల్లో ఆయన ప్రేక్షకులని ఏడిపించేసారు.ఇపుడు “బ్రహ్మానందం” సినిమాలో రాజా గౌతమ్ తో కలిసి నటిస్తున్నారు. తాత- మనవళ్ల మధ్య జరిగే కథ ఇది.ఆర్.వీ.ఎస్. నిఖిల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.మసూధ లాంటి డీసెంట్ సినిమా తీసిన రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఫిబ్రవరి 14 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ నేఫధ్యంలో ఈ రోజు టీజర్ ను విడుదల చేసారు మూవీ టీం.

బ్రహ్మానందం మాట్లాడుతూ..”డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి కథ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది, వెంటనే హీరో ఎవరు అని అడిగితే మీ అబ్బాయే అని అనుకుంటున్నాం అని అనగానే…తండ్రి కొడుకులను, తాత మనవళ్లను చేసావా అని అనుకున్నాను.కానీ అద్భుతమైన కథ ఇది.అలానే వెన్నెల కిశోర్ కూడా ఈ సినిమాలో మంచి పాత్ర పోషించాడు. నా తరువాత నా లెగసి ని వెన్నెల కిశోర్ ముందుకు తీసుకెళ్తాడు అని నమ్మకం ఏర్పడింది.” అని అన్నారు.