విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పై పొంగల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘సంక్రాంతికి వస్తున్నాం’.దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో పొంగల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

విక్టరీ వెంకటేష్ హోల్సమ్ ఎంటర్టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఆల్-టైమ్ ఇండస్ట్రీ మైల్ స్టోన్ ని సాధించింది. 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 12.5 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా 16.12 కోట్ల షేర్ సాధించింది. తెలుగు సినిమా 6వ రోజు కలెక్షన్స్ లోసంక్రాంతికి వస్తున్నాం కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది, రాజమౌళి RRR 6వ రోజు 9 కోట్ల షేర్‌ను అధిగమించింది. అలాగే సంక్రాంతికి వస్తున్నాం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల షేర్ మార్కును దాటింది.ఈ చిత్రం నార్త్ అమెరికాలో 2 మిలియన్ల మార్కును దాటడం ద్వారా ఓవర్సిస్ లో కూడా బిగ్ రెవెన్యూ సాధిస్తోంది. పూర్తి రన్ ముగిసే సమయానికి ఇది 3 మిలియన్ల మైలురాయిని ఈజీగా దాటుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.ఇప్పటికే నార్త్ అమెరికాలో వెంకటేష్‌కు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. వెంకీ కె కాదు దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు కూడా ఇది కొత్త రికార్డు.