బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ ఈ ముగ్గురి కాంబోలో పవర్ ప్యాకెడ్ ఫిల్మ్ గా “భైరవం” రాబోతుంది.విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సందర్బంగా మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు మేకర్స్.టీజర్ చూస్తున్నంత సేపు ముగ్గురు హీరోలు కూడా తమ నటన తో కట్టిపడేసారు అనే విషయం అర్ధమవుతుంది. ప్రత్యేకించి మంచు మనోజ్ కెరీర్ లో ఈ చిత్రం ఒక మలుపుగా అనుకోవచ్చు.

http://www.youtube.com/@anrstudios24
మంచు మనోజ్ మాట్లాడుతూ..”. అందరికీ నమస్కారం. విజయ్ ఈ కథ చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. ఇందులో నా బ్రదర్ రోహిత్, సాయి ఉన్నారని చెప్తే ఇంకా ఎక్సైట్ అయ్యాను. వెంటనే ఒప్పుకున్నాను. డైరెక్టర్ విజయ్ చాలా డెడికేటెడ్ గా ఈ సినిమాని తీశారు. ఆయన హార్డ్ వర్క్ కి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. నిర్మతలు రాధా మోహన్ గారికి, శ్రీధర్ గారికి థాంక్యూ సో మచ్. ఈ సినిమా గొప్ప విజయం కావాలని మా అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.ఇది జస్ట్ టీజర్ మాత్రమే. ట్రైలర్ అదిరిపోతుంది. సినిమా దుమ్ము లేచిపోతుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నాను’ అన్నారు.